దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్‌తో రాజమౌళి సినిమా తీయబోతున్నారన్న వార్త రజనీ అభిమానుల్లో సుడిగాలిలా వ్యాపించిపోయింది. దేశవ్యాప్తంగా ఉన్న రజనీకాంత్ అభిమానులు ఈ వార్త వెలువడగానే పట్టరాని సంతోషంతో హర్షం ప్రకటిస్తున్నారని సమాచారం. ‘బాహుబలి ద కంక్లూజన్’ తమిళ ఆడియో విడుదల సందర్భంగా చెన్నై వెళ్లిన చిత్ర బృందం చెన్నైలోని ఓ ప్రముఖ హోటల్‌లో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొంది. ఈ సమావేశంలో చిత్ర దర్శకుడు రాజమౌళి మాట్లాడారు. అలా మాట్లాడుతూ ‘‘సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో ఏదో ఒకరోజు సినిమా తీస్తా’’ అని తన మనసులో మాట బయటపెట్టారు. ఆదివారం రాత్రి ఈ ఒక్కమాట తమిళనాడులో పెను సంచలనమే సృష్టించింది
బాహుబలి ది బిగినింగ్ సినిమా తమిళ సీనీ వర్గాల్లో సృష్టించిన కలకలం ఇంతా అంతా కాదు. ఒక పట్టాన ఇతర భాషా చిత్రాల ఆధిక్యతను, నాణ్యతను ఒప్పుకోవడానికి అంగీకరించని తమిళ ప్రజలు, సినీ వర్గాలు బాహుబలి తొలి భాగాన్ని చూడగానే మతులు పోగొట్టుకున్నారు. బాహుబలి పార్ట్-1 విడుదలై మంచి హిట్ టాక్ వచ్చినప్పటి నుంచి బాలీవుడ్, కోలీవుడ్ నటులతో రాజమౌళి సినిమా చేయబోతున్నారని అనేక వార్తలు, ఊహాగానాలు వచ్చాయి.
అప్పట్లోనే రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌కు కాల్ చేసిన రజనీకాంత్ తనకు మంచి కథను ఇవ్వవలసిందిగా కోరినట్లు వార్తలొచ్చాయి. ఇక రాజమౌళి స్వయంగా రజనీకాంత్‌తో సినిమా తీయాలని ఉందన్న కోరికను ప్రకటించడంతో రజనీ అభిమానులు వెర్రెత్తిపోతున్నారని వార్తలు
No comments:
Post a Comment