Saturday, 25 March 2017

పవన్ గురించి రషీద్ ఖాన్ ఎం అన్నాడో వింటేఇక అంతే ?????????




బాలీవుడ్ సినిమాల్ని ఫాలో అయ్యేవారికి కమల్ ఆర్.ఖాన్ గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. ఒకటీ అరా బి-గ్రేడ్ సినిమాలు తీసిన ఈయన గారు తనకు తాను పెద్ద క్రిటిక్ అని చెప్పుకుంటాడు. విడుదలైన ప్రతి సినిమా మీదా రివ్యూలిస్తుంటాడు. బాలీవుడ్ హీరో హీరోయిన్లు.. దర్శక నిర్మాతల మీద అవాకులు చెవాకులూ పేలుతూ పబ్లిసిటీ తెచ్చుకుంటుంటాడు. అతడికి సౌత్ సినిమాలంటే చిరాకు. ఎప్పుడూ ఏదో ఒక మాట అంటుంటాడు. పోయినేడాది పవన్ కళ్యాణ్ సినిమా 'సర్దార్ గబ్బర్ సింగ్'ను హిందీలో రిలీజ్ చేస్తుంంటే తీవ్ర వ్యాఖ్యలు చేశాడతను. ఈ సినిమా ఎందుకూ పనికి రాదని.. పవన్‌కు హిందీలో ఎంతమాత్రం ఫాలోయింగ్ లేదని.. ఆ చిత్రాన్ని అక్కడ రిలీజ్ చేయడం వేస్ట్ అని అన్నాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ అతడిపై మండి పడ్డారు.తాజాగా మరోసారి పవన్‌ను టార్గెట్ చేశాడు కమల్. పవన్ పెద్ద మోసగాడని అతను వ్యాఖ్యానించాడు. ''తెలుగు యాక్టర్ పవన్ కళ్యాణ్ పెద్ద ఫ్లాప్ హీరో. ఇప్పుడతను పెద్ద మోసగాడు కూడా అయ్యాడు. డిస్ట్రిబ్యూటర్ దిలీప్ టాండన్‌ను అతను రూ.8 కోట్లకు మోసం చేశాడు'' అని ట్వీట్ చేశాడు కమల్. 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా హిందీ వెర్షన్‌కు సంబంధించి పవన్ మోసం చేశాడని కమల్ ఆరోపిస్తున్నాడు. మరోవైపు 'సర్దార్' వల్ల నష్టపోయిన కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్ సంపత్ నిరాహార దీక్ష చేస్తుండటాన్ని కూడా కమల్ ప్రస్తావించాడు. పవన్ వల్ల సంపత్ 2 కోట్లు నష్టపోయాడని.. అతను 7 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నాడని చెప్పి.. దాని తాలూకు ఫొటో కూడా జోడించాడు కమల్. ఇతగాడికి ట్విట్టర్లో ఫాలోయింగ్ భారీగానే ఉండటంతో పవన్ ఇమేజ్ నేషనల్ లెవెల్లో కొంచెం డ్యామేజ్ అవుతుందని భావిస్తున్నారు.

No comments:

Post a Comment

"జైలవకుశ " ట్రైలర్ 

అదిరిపోయిన నందమూరి తారకరామారావు  "జైలవకుశ " ట్రైలర్  జూ ఎన్టీఆర్  హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్నా  "జై లవకుశ "...