Sunday, 26 March 2017

జియో నుంచి ఇంకో ఆఫర్ ???

 

. త్వరలో గడువు పొడిగింపుపై జియో ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు -


రోజుకు 1జీబీ ఉచిత 4జీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు, యాప్ సర్వీస్‌లను కావాలనుకునే వారి కోసం జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను అందిస్తున్న విషయం విదితమే. ఈ నెలాఖరుతో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ముగుస్తుండగా ఆ తరువాత కూడా ఈ ఆఫర్ కావాలనుకునే వారి కోసం జియో ఈ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ప్రారంభించింది


అయితే

. ఈ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ప్రైమ్ మెంబర్‌షిప్ కోసం జియో డెడ్‌లైన్ విధించింది. అయితే ఆ గడువును మరో నెల పాటు పొడిగించనున్నట్టు తెలిసింది. ఏప్రిల్ 30వ తేదీ వరకు జియో ప్రైమ్ మెంబర్‌షిప్ కోసం కొత్త గడువు విధించనున్నట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.గత నెలాఖరు వరకు 10 కోట్ల మంది ఖాతాదారులను జియో కలిగి ఉండగా, వారిలో ఇప్పటి వరకు కేవలం 3 కోట్ల మంది మాత్రమే జియో ప్రైమ్ మెంబర్‌షిప్ పొందినట్టు తెలిసింది. పూర్తి స్థాయిలో అందరూ ప్రైమ్ మెంబర్ పొందాలంటే ఈ టైం సరిపోదని, అందుకే గడువును మరో నెల రోజుల పాటు పొడిగిస్తే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని జియో భావిస్తున్నట్టు తెలిసింది. దీనికి తోడు ఇంకా ప్రైమ్ మెంబర్ షిప్ పొందని వారిలో దాదాపుగా 80 శాతం మంది వరకు ఆ మెంబర్‌షిప్‌ను తీసుకునేందుకు సుముఖంగా ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే ఉన్న ప్లాన్లు, ఆఫర్ ప్యాక్‌లకు తోడుగా మరిన్ని ఆఫర్లను ప్రవేశ పెడితే దాంతో వారు కూడా ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకోవచ్చని తెలిసింది. అందుకు గాను పూర్తి స్థాయిలో ఖాతాదారులందరూ ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకోవాలంటే మరికొంత సమయం కచ్చితంగా అవసరం అవుతుందన్న భావనకు జియో వచ్చినట్టు తెలుస్తున్నది.ఈ నేపథ్యంలోనే ప్రైమ్ మెంబర్ షిప్ గడువును మరో నెల రోజు పాటు పొడిగించే అవకాశం లేకపోలేదని తెలిసింది. అదే జరిగితే దాదాపుగా 90 శాతం వరకు ఖాతాదారులను జియో ఒడిసి పట్టుకున్నట్టే అని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిపై జియో ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువరించలేదు


No comments:

Post a Comment

"జైలవకుశ " ట్రైలర్ 

అదిరిపోయిన నందమూరి తారకరామారావు  "జైలవకుశ " ట్రైలర్  జూ ఎన్టీఆర్  హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్నా  "జై లవకుశ "...