Sunday, 16 April 2017

చాలెంజింగ్ రోల్ లో నటించనున్న తమన్నా !






సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన తమన్నా ‘బాహుబలి – ది కంక్లూజన్’ రిలీజ్ కోసం ఎదురుచూస్తూ ఆ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఈ సినిమాతో ఆమె పేరు జాతీయ స్థాయిలో కాస్త పాపులర్ అయింది. అందుకే మంచి మంచి అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ మీడియా కథనాలు ప్రకారం తమన్నా మెయిన్ లీడ్ గా నిర్మాత వాసు భగ్నాని ఒక సినిమా నిర్మించనున్నారట. ఈ సినిమా ప్రస్తుతం తమిళంలో నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘కొలైయుతీర్ కాలం’ చిత్రానికి రీమేక్ అని అంటున్నారు.
మర్డర్ మిస్టరీగా ఉండనున్న ఈ చిత్రంలో నయనతార చెవిటి, మూగ పాత్రలో నటిస్తోంది. తమన్నా కూడా ఇదే తరహాలో నటించనుందని, ఇప్పటికే షూటింగ్ మొదలైందని, ప్రభుదేవా, భూమికలు కూడా ఈ ప్రాజెక్టులో నటిస్తున్నారని అంటున్నారు. అయితే ఈ విషయంపై మిల్కీ బ్యూటీ నుండి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. పైగా ఈ చిత్రాన్ని ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు, ఇతర విశేషాలేమిటి అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది.

No comments:

Post a Comment

"జైలవకుశ " ట్రైలర్ 

అదిరిపోయిన నందమూరి తారకరామారావు  "జైలవకుశ " ట్రైలర్  జూ ఎన్టీఆర్  హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్నా  "జై లవకుశ "...