Sunday, 16 April 2017

శతమానం భవతితెలుగు చిత్ర పరిశ్రమకి గర్వకారణం



తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం గర్వకారణమన్నారు మెగాస్టార్ చిరంజీవి.

దిల్‌’రాజు, సతీశ్‌ వేగేశ్నల కృషితో ‘శతమానం భవతి’కి జాతీయ అవార్డు లభించింది. తెలుగు చిత్రసీమకు అరుదైన గౌరవాన్ని తీసుకొచ్చిన ఈ చిత్రబృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే, తోటి నిర్మాతను గౌరవించిన అల్లు అరవింద్‌గారిని అభినందిస్తున్నా’’ అన్నారు మెగాస్టార్‌ చిరంజీవి

ఇటీవల ప్రకటించిన 64వ జాతీయ పురస్కారాల్లో ఉత్తమ ప్రజాదరణ పొందిన సమగ్ర వినోదాత్మక చిత్రంగా ‘శతమానం భవతి’ ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో అల్లు అకాడమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ సంస్థ తరఫున ‘శతమానం భవతి’ చిత్రబృందాన్ని సన్మానించారు

. ‘గీతాంజలి’, ‘శంకరాభవరణం’ చిత్రాల తరవాత ఘనత సాధించిన తెలుగు సినిమాగా ‘శతమానం భవతి’ నిలిచిందన్నారు.

. దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘జీవితంలో అనుకొన్నది సాధించినప్పుడు ఆ ఆనందం వేరుగా ఉంటుంది. ‘శతమానం భవతి’ విషయంలో చాలా మంది దగ్గర సలహాలు తీసుకొన్నా. అందులో నాని ఒకరు. మేం చేసిన ఓ మంచి ప్రయత్నం విజయవంతం కావడంతో పాటు, జాతీయ పురస్కారం కూడా లభించడం ఆనందాన్నిచ్చింది. అయితే ఈ పురస్కారం కంటే పదిహేనేళ్లుగా అల్లు అరవింద్‌ లాంటి ఓ మంచి వ్యక్తితో చేసిన స్నేహం గొప్పదిగా భావిస్తా’’ అన్నారు

No comments:

Post a Comment

"జైలవకుశ " ట్రైలర్ 

అదిరిపోయిన నందమూరి తారకరామారావు  "జైలవకుశ " ట్రైలర్  జూ ఎన్టీఆర్  హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్నా  "జై లవకుశ "...