గతేడాది చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ గా నిలిచిన చిత్రం @పెళ్లి చూపులు@ . ఈ మూవీని తమిళ్ లో రీమేక్ చేసేందుకు.. దర్శకుడు గౌతమ్ మీనన్ రైట్స్ కొనుక్కున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో రీతు వర్మ రోల్ కు.. తమన్నాను తీసుకుంటారనే టాక్ ఇప్పటివరకూ ఉండగా.. ఇప్పుడది కన్ఫాం అయిపోయింది.
రీసెంట్ గా పెళ్లి చూపులు రీమేక్ కు టైటిల్ కూడా అనౌన్స్ చేశాడు గౌతమ్ మీనన్. 'పొన్ ఒండ్రు కందేన్' అనే టైటిల్ ఫిక్స్ చేయగా.. హీరో పాత్రలో విష్ణు విశాల్.. హీరోయిన్ గా తమన్నా నటించబోతున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ రీమేక్ షూటింగ్ ప్రారంభం కానుండగా.. గౌతమ్ మీనన్ ఈ చిత్రానికి నిర్మాత మాత్రమే. సెంథిల్ వీరాస్వామి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. గౌతమ్ మీనన్ మూవీలో పని చేయడంపై తెగ థ్రిల్ ఫీలయిపోతున్నట్లు చెబుతోంది మిల్కీ బ్యూటీ.
నేను గౌతమ్ మీనన్ వర్క్ కి విపరీతమైన ఫ్యాన్ ని. ఆయన సినిమాల్లో మహిళలను చూపించే విధానం అద్భుతంగా ఉంటుంది. గౌతమ్ తో కలిసి పని చేయడం.. నాకు సుదీర్ఘం కాలంగా ఉన్న కోరిక. రొమాన్స్ జోనర్ ను ఆయన చూపినట్లుగా మరెవరూ చూపలేరు' అని చెబుతోంది తమ్మూ.
No comments:
Post a Comment