Tuesday, 11 April 2017

తండ్రీ కొడుకులతో నటించిన భామలు

ఏ ఫిలిం ఇండస్ట్రీలో అయినా వారసులు కనిపిస్తూనే ఉంటారు. తరాలు మారుతూనే ఉంటాయ్. టాలీవుడ్ లో కూడా ఈ ట్రెండ్ బాగానే నడుస్తుంది. కానీ తండ్రీ కొడుకులతో కలిసి నటించిన ముద్దుగుమ్మలు మాత్రం అరుదుగా ఉంటారు.

రామ్ చరణ్ తో కలిసి కాజల్ అగర్వాల్ పలు చిత్రాల్లో నటించింది. మగధీర నుంచి గోవిందుడు వరకూ వీళ్ల పెయిర్ కి మంచి డిమాండ్ ఉంది. కానీ ఈమెకు అన్నిటికంటే వచ్చిన పెద్ద అవకాశం చిరంజీవి సరసన ఖైదీ నంబర్ 150లో నటించడమే. 'నేను అప్పటికే చిరంజీవి సార్ ని చాలాసార్లు కలిశాను. చరణ్ తో షూటింగ్ లో సెట్స్ లోను.. పలు ఫంక్షన్స్ లోను మాట్లాడాను. ఆయన పక్కన హీరోయిన్ ఆఫర్ విషయం చరణ్ స్వయంగా చెప్పాడు' అని చెప్పింది కాజల్. అయితే.. ముందు కొడుకుతో నటించి.. ఆ తర్వాత తండ్రితో చేసిన ఏకైక హీరోయిన్ మాత్రం కాజల్ అగర్వాల్. మధ్యలో మెగా మేనల్లుడు అల్లు అర్జున్ తో కూడా కాజల్ నటించింది.

లావణ్య త్రిపాఠి ఇప్పటికే సోగ్గాడే చిన్ని నాయన మూవీలో నాగార్జున సరసన నటించింది.  ఇప్పుడు నాగచైతన్యకి జోడీగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీలో యాక్ట్ చేస్తోంది. 'నాకు చైతు సినిమాలో ఆఫర్ వచ్చినపుడు మొదట ఆశ్చర్యపోయా. నాగ్ సార్ తో నటించడంతో 2-3 ఏళ్ల వరకూ ఇలాంటి ఆఫర్ రాదనుకున్నాను' అని చెప్పింది లావణ్య.

నయన తార కూడా ఈ అరుదైన ఫీట్ సాధిస్తోంది. వెంకటేష్ తో పాటు పలు సినిమాలలో నటించిన నయన్.. హిట్ జోడీ అనిపించుకుంది. ఇప్పుడు వెంకీ అన్న కొడుకు రానా దగ్గుబాటితో కలిసి నటిస్తోంది. 'నేను మొదట టాలీవుడ్ లోకి వెంకటేష్ తోనే సినిమాతోనే వచ్చాను. ఇప్పుడు రెండేళ్ల తర్వాత రీఎంట్రీ రానాతో లభించింది. దగ్గుబాటి ఫ్యామిలీ నాకు ఎప్పుడూ స్పెషల్' అంటోంది నయనతార.

No comments:

Post a Comment

"జైలవకుశ " ట్రైలర్ 

అదిరిపోయిన నందమూరి తారకరామారావు  "జైలవకుశ " ట్రైలర్  జూ ఎన్టీఆర్  హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్నా  "జై లవకుశ "...