Monday, 10 April 2017

ఇక  వారానికి ఆరు రోజులే పెట్రోల్ బంక్స్






వాహనదారులకు ఇకపై ఆదివారాల్లో పెట్రోల్ కష్టాలు తప్పేలా లేవు. మే 10వ తేదీ నుంచి ప్రతి ఆదివారం పెట్రోల్ బంక్ లు మూసివేస్తామని దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ పంప్ ఓనర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

తమకిచ్చే కమిషన్ పెంచాలంటూ చాలాకాలంగా చేస్తున్న డిమాండ్‌ను పరిష్కరించకుంటే వచ్చేనెల 10 నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని తెలిపారు. అంతే కాదు మే 10 తర్వాత దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ పంపుల్లోనూ 8 గంటలు మాత్రమే పని చేస్తామని చెప్పారు. ఆ రోజును ‘నో పర్చేజ్ డే’గా కూడా పాటిస్తామన్నారు. డీలర్ కమిషనర్ రేటు సవరిస్తామని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు హామీ ఇవ్వడంతో జనవరిలో తాము తలెపెట్టిన సమ్మెను విరమించుకున్నామని… అయితే ఆ హామీ ఇప్పటికీ నెరవేర్చలేదని పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ తెలిపింది.

No comments:

Post a Comment

"జైలవకుశ " ట్రైలర్ 

అదిరిపోయిన నందమూరి తారకరామారావు  "జైలవకుశ " ట్రైలర్  జూ ఎన్టీఆర్  హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్నా  "జై లవకుశ "...