బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ మరో ప్రేమకథతో తాజాగా వార్తలకు ఎక్కాడు. రుమేనియాకు చెందిన ఇలియా వాంటర్‌తో సల్మాన్ అఫైర్ కొనసాగిస్తున్నాడనే వార్త గత ఏడాది నుంచి మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్నది. ఆ మధ్యలో అఫైర్ బ్రేకప్ అయి వాంటర్ రుమేనియాకు వెళ్లిపోయినట్టు వార్తలు రావడంతో ఇక సల్మాన్ ప్రేమ కథ కంచికి చేరిందనే వ్యాఖ్యలు వినిపించాయి. కానీ తాజాగా తన మేనల్లుడు జన్మదిన వేడుకల కోసం సల్మాన్ కుటుంబంతో వాంటర్ కలిసి మాల్దీవులకు వెళ్లడంతో సల్మాన్ అఫైర్ డెయిలీ సీరియల్‌లా కొనసాగుతున్నదని స్పష్టమైంది.
ఇటీవల కాలంలో వాంటర్‌కు సల్మాన్ చేరువైనట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ముంబైలో ఉంటున్న ఆమె అద్దె ఇంటికే పరిమితమైంది. గత నవంబర్ నుంచి ముంబైలో సల్మాన్ ఖాన్‌తో కలిసి ఉంటున్నది. ఇదిలా ఉండగా వీరిద్దరి అఫైర్ గురించి మరో వార్త మీడియాలో చర్చనీయాంశమైంది. వాంటర్‌కు ముంబైలో ఓ ఫ్లాట్‌ను కొనుగోలు చేసి బహుకరించినట్టు సమాచారం.
కొద్దికాలంగా అద్దె ఇంటిలో ఉంటున్న వాంటర్ ప్రస్తుతం సల్మాన్ గిఫ్ట్‌గా ఇచ్చిన ఫ్లాట్‌లోకి వెళ్లినట్టు సమాచారం. అయితే ఈ ఫ్లాట్ ఎక్కడ ఉన్నదనే విషయం చాలా గోప్యంగా ఉంచినట్టు తెలిసింది. అయితే సల్మాన్ నివసించే గెలాక్సీ అపార్ట్‌మెంట్‌కు సమీపంలోనే వాంటర్ ఉంటున్నట్టు తెలిసింది.
No comments:
Post a Comment