Add caption |
అసలే బాహుబలి బ్రాండింగ్ వుందేమో, తమన్నా తన పారితోషికం విషయంలో అసలు కాంప్రమైజ్ కానని చెబుతోందట. దీంతో ఆమె కథానాయికగా తెలుగు, తమిళంలో రీమేక్ చేయాలని చూసిన క్వీన్ చిత్రాన్ని పక్కన పెట్టేసారు. తమన్నా డిమాండ్లు తట్టుకోలేకపోతున్నామని, ఆమె అడిగే పారితోషికానికి అసలు వర్కవుట్ అవదని సదరు నిర్మాత దణ్ణం పెట్టేసాడు. క్వీన్ రీమేక్ చేయాలని చాలా కాలంగా చూస్తున్నప్పటికీ హీరోయిన్ ఎవరూ సెట్ కాలేదు.
ఫైనల్‌గా తమన్నా ఓకే చెప్పిందనుకుంటే, ఇప్పుడామె ఏమో భారీ పారితోషికం డిమాండ్ చేస్తూ ఇంకా చాలా కండిషన్లు పెట్టిందట. దాంతో తమన్నాని భరించడం తమ వల్లకాదని వేరే హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎవరైనా ఇమేజ్ వున్న హీరోయిన్ అయితేనే న్యాయం జరుగుతుంది కనుక స్టార్ హీరోయిన్ ఎవరైనా ఆసక్తి చూపిస్తారేమోనని చూస్తున్నారు. ఇప్పుడు తమన్నా వదిలేసిన ప్రాజెక్ట్ అంటుంటారు కాబట్టి మిగతా హీరోయిన్లు దీనిపై ఆసక్తి చూపిస్తారో లేదో అనేది అనుమానమే. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించడంతో పాటు కంగనకి చాలా పేరు తెచ్చిపెట్టిన క్వీన్‌ని రీమేక్ చేయడానికి త్రిష, అనుష్క, సమంత తదితరులంతా ఇంట్రెస్ట్ వుందన్నారు కానీ వారెవరితోను మెటీరియలైజ్ అవలేదు. తమన్నా కుదిరిందని ఆనందించే లోపు ఆమె చెట్టెక్కి కూర్చుంది. -
No comments:
Post a Comment