సామాజిక ఇతివృత్తాలకి కమర్షియల్ టచ్‌ను మేళవించి జనరంజకంగా తీర్చిదిద్దే ప్రతిభ, నైపుణ్యం అతికొద్ది మంది దర్శకులకు మాత్రమే ఉంటుంది. అలాంటి దర్శకుల్లో కొరటాల శివ మొదటి స్థానంలో ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటివరకు ఆయన తీసిన అన్ని చిత్రాలతో ఇది ప్రూవ్ చేశారు కూడా. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలపై పోరాడేందుకు నిత్యం ముందుండే హీరో పవన్ కళ్యాణ్, కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం పట్టాలెక్కనుంది. ఇందుకోస కొరటాల పవర్ ఫుల్ కథను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం
. ఆ కథను ఇటీవల పవన్‌కు వినిపించారని, ఓ సామాజిక సమస్య నేపథ్యంలో కథను మలచిన తీరు నచ్చడంతో ఈ చిత్రానికి పవన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న పవన్ ఇది పూర్తయిన వెంటనే కొరటాల శివ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకువచ్చే అవకాశం వుందని తెలిసింది. మరోవైపు మహేష్‌బాబు హీరోగా సమకాలీన రాజకీయాల నేపథ్యంలో భరత్ అనే నేను పేరుతో కొరటాల శివ ఓ చిత్రానికి శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మురుగదాస్ తెరకెక్కిస్తున్న ద్విభాషా చిత్రం స్పైడర్‌లో మహేష్ బాబు నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తిగానే కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ నటించనున్నారు.
No comments:
Post a Comment