Tuesday, 21 March 2017

_____ఇలా చేస్తే వాట్సాప్ హ్యాక్ అవ్వదు******

ఈ రోజుల్లో వాట్సాప్ లేని స్మార్ట్ ఫోన్ ఉండ‌దు. అయితే వాట్సాప్ యూజ‌ర్లు చాలా జాగ్ర‌త్త‌గా ఉంటే మంచిదంటున్నారు సైబ‌ర్ నిపుణులు.  ఫోన్ నుంచి స్కాన్ చేసి కంప్యూటర్ లో వాట్సాప్ యూజ్ చేస్తే మీ అకౌంట్ హ్యాకర్స్ బారిన పడినట్లే. కంప్యూట‌ర్ల‌లో  వాట్సాప్ వాడుతున్న వినియోగ‌దారులు ఆ బ్రౌజ‌ర్‌ను ఒక‌సారి రీస్టార్ట్ చేస్తే హ్యాకింగ్ బారినుంచి త‌ప్పించుకోవ‌చ్చ‌ని నిపుణులు సూచిస్తున్నారు.
వాట్సాప్‌ను హ్యాక్ చేసేందుకు హ్యాక‌ర్లు  ఫేక్ మెసేజ్‌ను ఒక ఇమేజ్ రూపంలో ముందుగా పంపుతారు. అందులో ఒక కోడ్ ఇమిడి ఉంటుంది. ఒక‌వేళ మీరు ఆ ఫోటోను డౌన్‌లోడ్ చేసిన‌ట్ల‌యితే అందులో ఉన్న కోడ్ మీకు తెలియ‌కుండానే మీ వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని హ్యాక‌ర్‌కు పంపుతుంది. ఒక్క‌సారి హ్యాక‌ర్ల చేతికి మీ అకౌంట్ లాగిన్ పాస్‌వ‌ర్డ్ దొరికిందంటే చాలు…ఇక మీ ఫోన్‌లోని కాంటాక్ట్స్ అన్నీ తీసుకుని వారికి న‌చ్చే విధంగా వాడుకుంటారు. మీకు తెలియ‌కుండానే జ‌రిగే ఈ తంతుతో మీరు బ‌లికావాల్సి వ‌చ్చింది. ఈ హ్యాకింగ్ బారిన ప‌డ‌కుండా ఉండాలంటే మీరు వాడుతున్న బ్రౌజ‌ర్‌ను రీస్టార్ట్ చేస్తేమంచిద‌ని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలా రీస్టార్ట్ చేస్తే  మీరు లేటెస్ట్‌గా అప్‌డేట్ అయిన వాట్సాప్ వ‌ర్షెన్‌ను పొంద‌గ‌లుగుతార‌ని వాట్సాప్ నిపుణులు తెలిపారు.

No comments:

Post a Comment

"జైలవకుశ " ట్రైలర్ 

అదిరిపోయిన నందమూరి తారకరామారావు  "జైలవకుశ " ట్రైలర్  జూ ఎన్టీఆర్  హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్నా  "జై లవకుశ "...