వివాదస్పద బాబ్రీ మసీదు కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. కోర్టు బయట పరిష్కారానికి ఇరుపక్షాలు అంగీకరించాలని కోరింది.
బాబ్రీ మసీదు వివాదం మతానికి, సెంటిమెంటుకు సంబంధించిన అంశమని వ్యాఖ్యానించింది. నమ్మకాలకు సంబంధించిన విషయాల్లో కోర్టు బయట పరిష్కారమే మేలని తెలిపింది. అవసరమైతే మధ్యవర్తిత్వానికి సిద్ధమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖెహర్ తెలిపారు. బాబ్రీ మసీదు అంశంపై అత్యవసరంగా విచారణ చేయాలని రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి పిటీషన్ పై సుప్రీంకోర్టు ఈ విధంగా స్పందించింది. చర్చల ద్వారా పరిష్కారం దొరక్కపోతే.. అప్పుడు మధ్యవర్తిగా వ్యవరించటానికి సిద్ధం అని కోర్టు స్పష్టం చేసింది. దీనిపై కేంద్రం పాజిటివ్ గా రియాక్ట్ అయ్యింది. చర్చల ద్వారా వివాదానికి పరిష్కారం తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. రామజన్మభూమి ఉద్యమ నేత వినయ్ కటారియా కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యలను స్వాగతించారు.

No comments:
Post a Comment