దేశంలో విద్యాసంస్థలపై నివేదిక తయారు చేసింది కేంద్రం. కొత్త ఏడాదిలో విద్యార్థులు మోసపోకుండా.. విద్యాసంవత్సరం నష్టపోకుండా.. నకిలీ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీల జాబితాను రిలీజ్ చేసింది. దేశ వ్యాప్తంగా 279 నకిలీ టెక్నాలజీ ఇన్ స్టిట్యూట్స్, 23 బోగస్ వర్సిటీలున్నట్లు తెలిపింది. ఆ జాబితాలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల కాలేజీలూ ఉన్నాయి. రాష్ట్రానికి చెందిన 36, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏడు సంస్థల పేర్లు కనిపిస్తున్నాయి. వీటికి అనుమతులతోపాటు డిగ్రీ పట్టాలు అందించే హక్కులులేవని స్పష్టంచేసింది. ఢిల్లీలో ఇలాంటి విద్యా సంస్థలు అత్యధికంగా (ఏడు బోగస్ వర్సిటీలు, 66 నకిలీ కళాశాలలు) ఉన్నట్లు పేర్కొంది. తెలంగాణతోపాటు ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ్ బెంగాల్, మహారాష్ట్రల్లోనూ ఇవి ఎక్కువగానే కనిపిస్తున్నట్లు వివరించింది. ‘అనుమతులు లేని సాంకేతిక విద్యా సంస్థల జాబితాలను సంబంధిత రాష్ట్రాలకు పంపించాం. కఠిన చర్యలు తీసుకోవాలని సూచించాం. మరోవైపు సదరు విద్యా సంస్థలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీయూ) కూడా నోటీసులు పంపించింది. కొన్నిచోట్ల విద్యార్థులను అప్రమత్తంచేసేందుకు పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చాం’అని సీనియర్ ప్రభుత్వాధికారి తెలిపారు. యూజీసీ, ఏఐసీటీయూ తమతమ వెబ్‌సైట్లలో (http://www.ugc.ac.in/, http://www.aicte-india.org/) ఈ జాబితాను పొందుపరిచాయి.
Subscribe to:
Post Comments (Atom)
"జైలవకుశ " ట్రైలర్
అదిరిపోయిన నందమూరి తారకరామారావు "జైలవకుశ " ట్రైలర్ జూ ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్నా "జై లవకుశ "...
-
సినీ ప్రేమికులు #అక్కినేని నాగచైతన్య సమంత ల పెళ్లి ఒక కొలిక్కి వొచినట్లే ఉంది కొన్నేళ్లుగా సాగుతున్న వీరి ప్రేమాయణం సాగుతున్న సంగతి...
-
ఆల్రెడీ కన్నడ నాట ‘బాహుబలి: ది కంక్లూజన్’ విడుదలపై అనుమానపు మేఘాలు ముసురుకున్నాయి. ఇప్పుడు తమిళనాట కూడా ఇబ్బందులు మొదలయ్యాయి. ఏప్రిల...
-
టాలివుడ్ అందగాడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యా చిలర్ ప్రభాస్ పెళ్లి గురించి రోజుకో వార్త ఇండస్ట్రీ లో వినిపిస్తూనే ఉంది తాజాగా ప్రభ...
No comments:
Post a Comment