కూరగాయల ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో మార్కెట్ కి వెళ్తేగానీ తెలియడం లేదు. సమ్మర్ వచ్చిందంటే చాలు కూరగాయలు మార్కెట్ కు చాలా తక్కువగా వస్తాయి. డిమాండ్ తగ్గ సప్లై లేకపోవడంతో కూరగాయధరలు అమాంతం పెరుగుతున్నాయి.
సిటీలో గత 20 రోజులుగా చూస్తే కూరగాయల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. కొన్ని రోజులుగా కేజీ టమాట, వంకాయ, క్యాబెజీ 15 రూపాయలు ఉండగా ప్రస్తుతం కూడా పెద్దగా మార్పులు లేవు. ఇక బెండ, బీరకాయ కేజీ 40 నుంచి 45 రూపాయలు రైతుబజార్లోనే అమ్ముతున్నారు. బహిరంగ మార్కెట్ లో 60 నుంచి 70 వరకు పలుకుతున్నాయి. ఇక పచ్చిమిర్చి 30 రూపాయలు హోల్ సేల్ గా ఉంటే రిటైల్ గా 50 రూపాయల వరకు ఉంది. పెరిగిన ధరలతో పబ్లిక్ పరేషాన్ అవుతున్నారు.
పెరుగుతున్న ఎండలతో పాటు పంటకు సరిపడా నీరు లేకపోవడంతో కూరగాయల ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు రైతులు, వ్యాపారులు. మార్కెట్ కు సరుకు తక్కువగా రావడంతో రేట్లు పెరుగుతున్నాయంటున్నారు. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
కూరగాయల ఇలా ధరలు ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఏప్రిల్, మే నెలలో ఎలా ఉంటాయో అన్న ఆందోళన పబ్లిక్ లో కనబడుతోంది

No comments:
Post a Comment