Friday, 7 April 2017

టాలీవుడ్ లైంగిక వేదింపుల పై స్పందించిన రిచా గంగోపాధ్యాయ







ఇటీవలే తెలుగు హీరోయిన్ 'నచ్చావులే' ఫేమ్ మాధవిలత తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించి "కో-ఆపరేటివ్" గురించి సంచలన విషయాలను వెల్లడించగా, తాజాగా ఈ జాబితాలో మరో హీరోయిన్ చేరింది. "లూసీ" అనే సినిమాతో కన్నడ నాట మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న శృతి హరిహరన్ అనే హీరోయిన్ తెలుగు సినీ పరిశ్రమపై సంచలన ఆరోపణలు చేసింది. టాలీవుడ్ లో అవకాశాలు రావాలంటే, అక్కడున్న డైరెక్టర్లకు "క్యాస్టింగ్ కౌచ్" పేరుతో 'లైంగిక వాంఛలు' తీర్చాల్సిందేనని, లేని పక్షంలో నిలదొక్కుకోలేమని, అయితే అందుకు తానూ సిద్ధంగా లేనని, అందుకే దక్షిణాదిలో పెద్ద సినీ పరిశ్రమలైన తెలుగు, తమిళ రంగాల వైపుకు తానూ చూడడం లేదని, తన ఆత్మగౌరవాన్ని, మానాభిమానాలను వదులుకుని బతకలేనని, తెలుగు చిత్ర పరిశ్రమతో పోలిస్తే కన్నడలో "కాస్టింగ్ కౌచ్" అంతగా లేదని చెప్పుకొచ్చింది    




ఇవి ఈ మధ్య కాలం లోవి అయితే గతం లో ఒకరూ ఇద్దరూ కాదు రాధికా ఆప్టే,తాప్సీ, లతో సహా పరోక్షంగా ఇక్కడ లైంగిక వ్యవహారాలు సినీ జీవితం లో ఒకభాగం అయిపోయాయి అన్న అర్థం వచ్చేంతగా పలువురు హీరోయిన్లనుంచీ ఆరోపనలు వచ్చాయి. ఇవన్నీ లైట్ తీస్కుందాం అనుకునేంతలోనే నిన్న ఒకప్పటి హీరోయిన్ సుకన్య కూడా తనను ఒక హీరో పడగ్గదికి రమ్మని పిలిచాడనీ తాను ఒప్పుకోకపోవటం వల్లే ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా చేశాడని చెప్పుకొచ్చింది. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న ఆ అగ్ర హీరో తో ఒకే ఒక సినిమా చేసానని క్లూ ఇచ్చింది కూడా. ఆమె సినిమా లిస్ట్ చూస్తే ఒక హీరో మీద అనుమానం రాక మానదు. ఇంతగా అబాసుపాలైన టాలివుడ్ గురించి రిచా గంగోపాధ్యాయ మాత్రం పాజిటివ్ గా స్పందించింది.'లీడర్‌' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్న బెంగాలీ భామ రిచా గంగోపాధ్యాయ ఈ విషయంలో కాస్త విభిన్నంగా స్పందించింది. తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో తానెప్పుడూ లైంగిక వేధింపులు ఎదుర్కోలేదని చెప్పింది. తానెప్పుడూ చాలా సీరియస్‌గా, స్ట్రిక్ట్‌గా ఉండడం వల్ల తన జోలికి రావడానికి భయపడ్డారేమోనని అంటోంది. 'సినీ పరిశ్రమ అనే కాదు.. ఏ ఇతర రంగంలోనైనా మనం ధైర్యంగా ఉంటే మన జోలికి ఎవరూ రార'ని ఓ ఇంగ్లిష్ వెబ్‌పోర్టల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది.

No comments:

Post a Comment

"జైలవకుశ " ట్రైలర్ 

అదిరిపోయిన నందమూరి తారకరామారావు  "జైలవకుశ " ట్రైలర్  జూ ఎన్టీఆర్  హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్నా  "జై లవకుశ "...