Saturday, 8 April 2017

పెళ్లి నరకం నుండి తప్పుకున్న హీరో????/






తొలిముద్దు.. జీన్స్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచతమైన హీరో ప్రశాంత్. ప్రస్తుతం ఈయన వైవాహిక జీవితం కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోయింది. తాజాగా కోర్టు నుంచి విడాకులు కూడా అందుకున్నాడు ప్రశాంత్. తన భార్య గృహలక్ష్మి కారణంగా ఎంతో మానసిక వేదన అనుభవించినట్లుగా కూడా చెప్పాడు.

'గృహలక్ష్మికి అంతకు ముందే వివాహమైనా.. ఆ విషయం దాచి నన్ను మోసం చేసి పెళ్లే చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా అతనితో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయాను. ఆమె ప్రవర్తన నచ్చకపోవడంతో చెన్నై ఫ్యామిలీ కోర్టు నుంచి విడాకులు తీసుకున్నాను' అని చెప్పాడు ప్రశాంత్. అప్పట్లో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానన్న ఈ హీరో.. మనో వేదనతో నరకం చూశానన్నాడు. అయితే.. తాను ఎలాంటి మోసం చేయలేదంటూ ఈమె హైకోర్టును ఆశ్రయించినా.. అక్కడ కూడా ప్రశాంత్ వాదననే కోర్టు సమర్ధించింది.

ఆరేళ్ల తన వైవాహిక జీవితం జీవితంలో నరకం అనుభవించానన్న ప్రశాంత్.. ఇంకా కుమారుడి సమస్య తీరకపోవడం బాధాకరంగా ఉందని అన్నాడు. మైనర్ బాలుడు కావడంతో.. తల్లి దగ్గరే ఉండాలని కోర్టు చెబుతుండడంతో.. చట్రప్రకారమే నడుచుకోనున్నట్లు తెలిపాడు.

No comments:

Post a Comment

"జైలవకుశ " ట్రైలర్ 

అదిరిపోయిన నందమూరి తారకరామారావు  "జైలవకుశ " ట్రైలర్  జూ ఎన్టీఆర్  హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్నా  "జై లవకుశ "...