Wednesday, 19 April 2017

పవన్ కోసం సీత వేట్ చేసిందా ......





ముద్దు ముద్దుగా ఉంటూ భారీ అందాలతో యూత్ను ఒక ఊపు ఊపేసిన నాటి హీరోయిన్. పెరిగిన వయసుతో హీరోయిన్ నుంచి తల్లి క్యారెక్టర్స్ లోకి వచ్చేసింది. నేటి యూత్ కి ఐకాన్ లాంటి పవర్ స్టార్ పవన్ కల్యాణ్తో గోకులంలో సీత సినిమాలో తళుక్కున మెరిసిన ఆమె.. తాజాగా నాటి మెమరీస్ ను గుర్తు తెచ్చుకుంది. తాజాగా లంక చిత్రంలో నటిస్తోన్న ఆమె.. 75 సినిమాల్లో తానిప్పటికి నటించానని.. వాటికి భిన్నమైన రోల్ లంకలో చేసినట్లుగా చెప్పింది.

కల్యాణ వైభోగం చిత్రంలో హీరోయిన్ తల్లి పాత్ర ఆఫర్ వచ్చినప్పుడు నో చెప్పానని.. కానీ.. తర్వాత కథ విని ఓకే చెప్పానని చెప్పిన రాశి.. ఈ మధ్యన జరిగిన ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు. తమ పాప బర్త్ డే సందర్బంగా పవన్ కల్యాణ్ ను కలవటానికి వెళ్లానని.. తీరా ఆయన వద్దకు వెళ్లాక.. అపాయింట్ మెంట్ తీసుకున్నారా? అని అడిగారని.. తాను వచ్చిన విషయం పవన్ కు తెలీలేదన్నారు.

తాను బయట వెయిట్ చేశానని.. తర్వాత తెలిసి.. వెంటనే పిలిపించి చాలాసేపు మాట్లాడారని.. తాను పవన్ తో మాట్లాడిన సమయాన్ని మర్చిపోలేనన్నారు. గోకులంలో సీత సమయంలో కంటే కూడా తాజాగా కలిసినప్పుడే ఎక్కువసేపు మాట్లాడారంటూ రాశి చెప్పిన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

ఒకప్పటి హీరోయిన్..






పవన్ కోసం సీత వేట్ చేసిందా ......

No comments:

Post a Comment

"జైలవకుశ " ట్రైలర్ 

అదిరిపోయిన నందమూరి తారకరామారావు  "జైలవకుశ " ట్రైలర్  జూ ఎన్టీఆర్  హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్నా  "జై లవకుశ "...