మోడల్.. బాలీవుడ్ యాక్ట్రెస్ అయిన సోఫియా హయత్.. ఆ తర్వాత తనకు తానే దేవతగా ప్రచారం చేసుకుంది. మళ్లీ ఇప్పుడు వైవాహిక జీవితంలో అడుగుపెడుతున్నట్లు చెప్పిన ఈమె.. తాజాగా మక్కాను సందర్శించింది. మహిళల పట్ల ఎంతో గౌరవం ఇస్తారనే ఇస్లాం అంటే తనకు ఎంతో గౌరవం అని చెప్పిన సోఫియా.. పవిత్ర మక్కాలో పలువురు మగాళ్లు.. తనతో దారుణంగా ప్రవర్తించారని అంటోంది
ఇస్లాం మహిళలను ఎంతో గౌరవిస్తుంది. తన భార్య కాని వారిని, తనకు సంబంధం లేని మహిళలను వారు టచ్ చేయరాదు. మహిళలకు ఇంత గౌరవం ఉంటుంది కాబట్టే నాకు ఇస్లాం అంటే ఎంతో ఇష్టం. అయితే ఈరూల్స్ పవిత్రమైన మక్కా నగరంలో అమలు కావడం లేదు. ఇక్కడకి వచ్చిన కొందరు మగాళ్లు ఈ రూల్స్ మరిచిపోతున్నారు... ఏకంగా మహిళలపై సెక్సువల్ వేధింపులకు దిగుతున్నారు అంటూ సోఫియా హయత్ ఆరోపించారు
No comments:
Post a Comment