ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సాహో' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇదే. ఏప్రిల్ 28న సాహో టీజర్ రిలీజ్ కాబోతోంది.
బాహుబలి తర్వాత ప్రభాస్ 'సాహో' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. టీజర్ బాహుబలి 2 సినిమా రిలీజ్ అయ్యే థియేటర్లలో హిందీ, తమిళం, తెలుగులో ప్రదర్శింపబడుతుందని ప్రభాస్ తెలిపారు. బాహుబలి 2 ఇంటర్వ్యూలో ప్రభాస్ ను తన తర్వాతి సినిమా విషయమై ప్రశ్నించగా అందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. తన తర్వాతి సినిమా సుజీత్ దర్శకత్వంలో 'సాహో' పేరుతో తెరకెక్కుతోందని, ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టెనర్ గా రూ. 150 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోందన్నారు
No comments:
Post a Comment