Monday, 24 April 2017

బర్నింగ్ స్టార్ సంపూర్ణేణ్ బాబును ఇంతమాట అన్నారా ......





బర్నింగ్ స్టార్ సంపూర్ణేణ్ బాబును మొదట్లో చూసి ఇతను హీరో ఏంటి అన్నారు. బర్నింగ్ స్టార్ అంటూ ఆ బిరుదేంటి అని కూడా ఎద్దేవా చేశారు. కానీ ‘హృదయ కాలేయం’ సినిమాలో ఇలాంటి బిల్డప్పులతోనే ఆకట్టుకున్నాడు సంపూ. ఈ సినిమా సెన్సేషనల్ హిట్టయింది. సంపూర్ణేష్ బాబుకు ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించి పెట్టింది. ఇప్పుడు ‘కొబ్బరి మట్ట’ అనే మరో సెటైరికల్ కామెడీతో రాబోతున్నాడు సంపూ. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన నేపథ్యం గురించి సంపూ సంచలన విషయాలు బయటపెట్టిన సంగతి తెలిసిందే. తాను ఎన్నారై అని.. తనకు చాలా డబ్బులన్నాయని చెప్పిన మాటలన్నీ అబద్ధమని.. సిరిసిల్లలోని సామాన్య కుటుంబానికి చెందిన వాడినని సంపూ వెల్లడించాడు ఓ ఇంటర్వ్యూలో.

ఇక తానెలా హీరో అయ్యానో సంపూ చెబుతూ.. ''మా సిరిసిల్లలో బంగారం షాపులో పని చేసుకుంటూనే సినిమా అవకాశాల కోసం అప్పుడప్పుడూ హైదరాబాద్‌ వచ్చేవాడిని. అనుకోకుండా కృష్ణవంశీ గారి 'మహాత్మ' సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమా తర్వాత అవకాశాల కోసం ఆఫీస్‌ల చుట్టూ తిరిగేవాడిని. అందరూ నన్ను డబ్బులు అడిగేవారు. అలాంటి సమయంలో రాజేష్ గారితో పరిచయం అయింది. కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేసి రమ్మన్నాడు. 'నేనొక చెత్త హీరోని పెట్టి ఓ చెత్త సినిమా చేద్దామనుకుంటున్నా. ఈ సినిమా చూసి జనాలు పిచ్చి తిట్లు తిడతారు. ఈ కథ ఇంతకుముందే కొంతమందికి చెప్పా. వాళ్లకు నచ్చలేదు. నువ్వు బాగా ఆలోచించుకుని చెప్పు' అనడంత స్టన్నయ్యాను. నువ్వేం చెబితే అది చేస్తానని చెప్పా. అలా  'హృదయ కాలేయం' మొదలైంది. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు'' అని సంపూ అన్నాడు.

No comments:

Post a Comment

"జైలవకుశ " ట్రైలర్ 

అదిరిపోయిన నందమూరి తారకరామారావు  "జైలవకుశ " ట్రైలర్  జూ ఎన్టీఆర్  హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్నా  "జై లవకుశ "...