టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. తెలుగు సినీ పరిశ్రమలో భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించడమే కాకుండా అగ్ర హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేస్తున్నది. సినిమాల్లో నటిస్తునే సొంత వ్యాపారాలను విస్తరిస్తున్నది. రకుల్ ప్రీత్ సింగ్ బిజీగా ఉంటూనే తాజాగా సామాజిక కార్యక్రమాలకు నడం బిగించింది. ఆమె చెప్పట్టిన సేవా కార్యక్రమంపై సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన లభిస్తున్నది
.
సిల్లీ లొల్లి పేద విద్యార్థుల కోసం.. పేద విద్యార్థుల సంక్షేమం కోసం సినీ నటి, మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ టీచ్ ఫర్ చేంజ్ సంస్థను స్థాపించింది. ఆ సంస్థ కార్యక్రమంలో భాగంగా బంజారాహిల్స్‌లోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి విద్యార్ధులకు ఇంగ్లీష్ పాఠాలను రకుల్ బోధించింది. ఆంగ్ల భాష బోధన ఆంగ్లంలో వ్యతిరేకపదాల గురించి వివరించడంతో పాటు విద్యార్ధులకు ఇంగ్లీష్ స్పీకింగ్ యాక్టివిటీ గురించి వివరించినట్టు సంస్థ నిర్వాహకులు మీడియాకు తెలిపారు. బీ ద చేంజ్, టీచ్ ఫర్ చేంజ్ అనే సందేశాన్ని ఇచ్చేందుకు రకుల్ ఆ పాఠశాలకు వెళ్ళినట్టు తెలుస్తుంది.
హైదరాబాద్ వ్యాప్తంగా సుమారు 25 పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు సమాచారం. ప్రభుత్వ పాఠశాలలో 8,9వ తరగతి చదువుతున్న విద్యార్ధులకు ఆంగ్ల భాషతో పాటు లీడర్ షిప్ క్వాలిటీస్‌ను పెంచడం టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ముఖ్య ఉద్దేశం. మహేశ్‌బాబుతో రకుల్ ప్రస్తుతం ప్రిన్స్ మహేశ్‌బాబు, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న స్పైడర్ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నది. ఈ చిత్రంలో రకుల్ మెడికల్ స్టూడెంట్ పాత్రను పోషిస్తున్నది. స్పైడర్ చిత్రానికి సంబంధించిన స్టిల్స్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ చిత్రంలో మహేశ్‌ను రకుల్ వెంటాడుతున్నట్టు ఓ ఫొటోలో కనిపించింది. సినిమా చూస్తేనే గానీ మహేశ్‌ను ఎందుకు వెంబడిస్తుందనే విషయంపై క్లారిటీ వస్తుంది. జూన్ 23న స్పైడర్.. తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న స్పైడర్ ఫస్ట్‌లుక్ ఇటీవల విడుదలైంది.
ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్, టాగోర్ మధు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రంజాన్ పండుగను పురస్కరించుకొని జూన్ 23న విడుదలకు సిద్ధమవుతున్నది.
No comments:
Post a Comment