Thursday, 13 April 2017

బాహుబలి ఆపమంటూ పిటిషన్






ఆల్రెడీ కన్నడ నాట ‘బాహుబలి: ది కంక్లూజన్’ విడుదలపై అనుమానపు మేఘాలు ముసురుకున్నాయి. ఇప్పుడు తమిళనాట కూడా ఇబ్బందులు మొదలయ్యాయి. ఏప్రిల్ 28న బాహుబలి-2 విడుదల కాకుండా ఆపమంటూ మద్రాస్ హైకోర్టులో ఓ తమిళ డిస్ట్రిబ్యూటర్ పిటిషన్ వేయడం విశేషం. కోర్టు ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది కూడా. బాహుబలి-2కు సంబంధించి ఫైనాన్స్ వ్యవహారాలే ఈ పిటిషన్ కు దారి తీసినట్లు తెలుస్తోంది.

శ్రీ గ్రీన్ ప్రొడక్షన్స్ సంస్థకు చెందిన శరవణన్ అనే నిర్మాత తమిళనాడు అంతటా బాహుబలి-2 ఎగ్జిబిషన్ హక్కులు సొంతం చేసుకున్నాడట. ఇందుకోసం అతను గత ఏడాది జనవరిలో ఏసీఈ మీడియా అనే సంస్థ నుంచి కోటి రూపాయలకు పైగా లోన్ తీసుకున్నాడట. బాహుబలి-2 విడుదలకు ముందు రూ.10 లక్షలు కలిపి ఆ డబ్బు తిరిగిచ్చేలా ఒప్పందం జరిగింది. కానీ ఇచ్చిన హామీ ప్రకారం డబ్బులు చెల్లించలేదు.

ఏప్రిల్ 9న ఈ విషయమై జరిగిన చర్చలు ఫలించలేదు. దీంతో ఏసీఈ సంస్థ కోర్టును ఆశ్రయించింది. తమకు మొత్తం రూ.1.18 కోట్లు రావాల్సి ఉందని.. ఒప్పందం ప్రకారం డబ్బులివ్వని నేపథ్యంలో ఈ నెల 28న బాహుబలి-2 విడుదల కాకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దారు కోరాడు. మరి ఈ వివాదాన్ని పరిష్కరించుకుని బాహుబలి-2ను యధావిధిగా రిలీజ్ చేస్తారేమో చూడాలి.

No comments:

Post a Comment

"జైలవకుశ " ట్రైలర్ 

అదిరిపోయిన నందమూరి తారకరామారావు  "జైలవకుశ " ట్రైలర్  జూ ఎన్టీఆర్  హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్నా  "జై లవకుశ "...