Tuesday, 21 March 2017

బ్యాడ్ న్యూస్‌: కొత్త IOSతో యాప్స్‌కు ముప్పు తప్పదా ??????

యాపిల్  సంస్థ ఈ ఏడాది చివ‌రిలో ఐఓఎస్ 11ను విడుద‌ల చేయ‌నుంది. అయితే ఇందులో 32 బిట్ స‌పోర్ట్ చేసే యాప్స్ ఇక‌పై ప‌నిచేయ‌వు. దీంతో 1.87000 యాప్స్ ప‌నిచేయ‌కుండా పోతాయి. ప్ర‌స్తుతం ఐఓఎస్ డెవెల‌ప‌ర్లు లేటెస్ట్ బీటా వెర్ష‌న్ 10.3 మీద క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వారికి ఒక ఎర్ర‌ర్ వ‌చ్చిన‌ట్లు గ‌మనించారు. ప్ర‌స్తుతం ఐ ఫోన్ వాడుతున్న వారంద‌రికీ భ‌విష్య‌త్తులో ఈ యాప్స్ ఇక ప‌నిచేయ‌వ‌నే పాప‌ప్ మెసేజ్ వెళుతోంద‌ని సంస్థ వెల్ల‌డించింది. పాత త‌రం ఐఫోన్ల‌ను దృష్టిలో ఉంచుకుని 32 బిట్ స‌పోర్ట్ చేసేలా ఈ యాప్స్‌ను డిజైన్ చేశారు.ఫ‌లానా యాప్స్ మాత్ర‌మే 32 బిట్ ప్రాసెస‌ర్‌తో ప‌నిచేయ‌వ‌ని యాపిల్ క్లారిటీ ఇవ్వ‌న‌ప్ప‌టికీ … ప్ర‌తిరోజు వాడే ఫేస్‌బుక్ యాప్‌, ఇన్స్‌టాగ్రామ్‌, మ్యాప్స్‌, పోకేమాన్‌గో లాంటి వాటిపై ప్ర‌భావం ప‌డే అవ‌కాశ‌ముంద‌ని యాపిల్ సంస్త పేర్కొంది. ఈ నెలాఖ‌ర్లోగా కొత్త ఐఓఎస్ 10.3 వెర్ష‌న్‌ను అందుబాటులోకి తీసుకురానుంది

No comments:

Post a Comment

"జైలవకుశ " ట్రైలర్ 

అదిరిపోయిన నందమూరి తారకరామారావు  "జైలవకుశ " ట్రైలర్  జూ ఎన్టీఆర్  హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్నా  "జై లవకుశ "...