Wednesday, 22 March 2017

/////ఓక  రోజులో  మన శరీరానికీ  ఎంత  నీరు అవసరమో చూద్దాం

మీకు తెలుసా ??????              ఆరోగ్యకరమైన జీవితంలో నీటి యొక్క పాత్ర

                                  
  • మానవ శరీరంలో జీర్ణక్రియకు నీరు తప్పని సరి అవసరం.

  • వేడి వాతావరణంలో శరీరాన్ని చల్లబరచి & చల్లటి ప్రదేశాలలో తగిన విధంగా మారుస్తుంది.

  • నీరు ఎక్కువ తాగటం వలన కొవ్వు పదార్థాలను విచ్చిన్న చెంది, బరువు తగ్గుతారు.

  • ఎక్కువ మొత్తంలో నీరు తాగటం వలన మీ చర్మం మృదువుగా & ఆకర్షణీయంగా మారుస్తుంది.

  • మీరు త్వరగా అలసటగా ఫీల్ అవుతున్నారా! కండరాల నొప్పి లేదా మీరు ఎంత కష్ట పడినను బరువు తగ్గటం లేదా? అయితే శరీరానికి అవసరం అయిన మొత్తంలో నీరు తాగటం లేదన్నమాట.
    శరీర అవయవాలు వాటి క్రియలను సరిగా నిర్వహించటానికి నీరు తప్పని సరిగా అవసరం, అంతేకాకుండా సౌందర్యంగా కనపడటానికి మరియు సంతోషంగా ఉండుటలో కూడా నీరు ముఖ్య పాత్ర పోషిస్తుంది. జీవ మనుగడకు నీరు అవసరమైనదిగా చెప్పవచ్చు. జీవించే ప్రతి జీవికి నీరు అవసరం. కణాలు ఆక్సిజన్'ను గ్రహించటానికి నీరు అవసరం, మానవ శరీరం దాదాపుగా 60 శాతం నీటితో నిర్మితమైంది మరియు శరీర విధులు కొనసాగించుటకు నీరు అవసరం. శ్వాసలో సమస్యలు రాకుండా ఉండుటకు, మూత్ర తయారీ, వివిధ రకాల విధుల నిర్వహణ కోసం నీరు అవసరం కావున అధిక నీటిని తీసుకోవటం ఆరోగ్యానికి మంచిదే.
    మానవ శరీరంలో నీరు తప్పని సరిగా అవసరం అనటానికి నిజాలు ఇక్కడ తెలుపబడ్డాయి

  • జీర్ణక్రియకు సహాయం

    నీరు జీర్ణక్రియలో సహాయపడుతుంది. మానవులలో జీర్ణక్రియ సరైన విధంగా కొనసాగించబడుటకు నీరు తప్పని సరి. ఒకవేళ మీ శరీరంలో నీటి కొరత ఏర్పడినట్లయితే మలబద్దకానికి దారి తీసే అవకాశం ఉంది, ఇంతటితో ఆగకుండా వివిధ రకాల ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం కూడా ఉంది.

    రక్తప్రసరణ

    మీ శరీరం డీ హైడ్రేషన్'కు గురైన తరువాత, నీటి స్థాయిలు తగ్గటం వలన శరీరంలో ఉండే రక్తం చిక్కగా మారి, రక్త ప్రసరణ తగ్గిపోతుంది. రక్త ప్రసరణ తగ్గటం వలన తలనొప్పి ముఖ్యంగా అలసట వంటివి కలుగుతాయి. కావున, తగినంత నీటిని త్రాగటం వలన శరీర రక్త సరఫరా కూడా ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించబడుతుంది.

    ఉష్ణోగ్రతలు

    నీరు శరీర ఉష్ణోగ్రతలను నియంత్రిస్తుంది, అందువలనే మీ ఆరోగ్య నిపుణులు మరియు సలహాదారులు వ్యాయామాల తరువాత ఎక్కువగా నీరు తాగమని సలహా ఇస్తుంటారు. భౌతిక కార్యకలాపాలను చేసే సమయంలో కలిగే శ్వాస సంబంధిత సమస్యలు మరియు చెమట కలగటం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. మీ శరీరంలో సరిపోయేంత స్థాయిలో నీరు లేకపోతె శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. మీ శరీరాన్ని డీ-హైడ్రేషన్'కు అనుగుణంగా ఉంచుకోవటం వలన మంచి ప్రతిభను కనబరుస్తారు మరియు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఒకవేళ మీ శరీరం డీ-హైడ్రేషన్'కు అనుగుణంగా ఉండనట్లయితే అలసట, శరీర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. నీరు వేడి వాతావరణంలో శరీరాన్ని చల్లబరచటమే కాకుండా చల్లటి వాతావరణానికి తగిన విధంగా శరీరాన్ని మారుస్తుంది.

    బరువు తగ్గుటలో ప్రోత్సాహం

    నీరు బరువు తగ్గుటలో ముఖ్య పాత్ర అనగా డీ-హైడ్రేషన్, కొవ్వు పదార్థాల విచ్చిన్నం, వ్యర్థ పదార్థాలను భయటకి పంపటం వంటి వాటి రూపాలలో బరువు తగ్గిస్తుంది అంతేకాకుండా, ఆకలి అవనివ్వదు, భోజనానికి


    వ్యర్థ పదార్థాలను భయటకి పంపుట

    మూత్ర పిండాల ముఖ్య విధి వ్యర్థ పదార్థాలను మరియు విష పదార్థాలను శరీరం నుండి భయటకు పంపటం. నీరు తక్కువగా తాగటం వలన మూత్రపిండాలపై భారం పడుతుంది. కావున, శరీరం నుండి వ్యర్థ పదార్థాలను భయటకి పంపటానికి అవసరమైనంత మొత్తంలో నీరు తప్పని సరి. మూత్రపిండాల వ్యాధులతో భాదపడే వారిలో ముఖ్యంగా మూత్రపిండాలలో రాళ్ళు వంటి సమస్యలతో ఇబ్బందులకు గురయ్యే వారికి ప్రతిరోజు 8 గ్లాసుల నీరు తాగమని వైద్యులు సలహా ఇస్తుంటారు.

    ఆరోగ్య సమస్యలు

    రోజు అవసరమైనంత మొత్తంలో నీరు తాగటం వలన శరీరంలో జరిగే విధులు సరైన విధంగా కొనసాగించబడతాయి. మీ శరీరంలో నీటి కొరత ఏర్పడినట్లయితే, తలనొప్పి, మైగ్రిన్, అలసట, నిస్పృహ మరియు డిప్రెషన్ వంటి వాటికి గురవుతుంటారు. శరీరంలో తగిన స్థాయిలో నీరు అందుబాటులో ఉండటం వలన వెన్నునొప్పి, కండరాల నొప్పులు ధరిచేరవు.

    చర్మానికి కలిగే ఉపయోగాలు

    నీరు ఎక్కువగా తాగటం వలన చర్మం మృదువుగా, ఆకర్షణీయంగా మారుతుంది. చర్మాన్ని తేమభరితంగా ఉంచి, కండరాల కదలికలను సరిగా అయ్యేలా చేస్తుంది.

    ఎంత మొత్తంలో నీరు తీసుకోవాలి

    'ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్' ప్రకారం, రోజులో పురుషులు 13 కప్పుల నీటిని తాగాలి మరియు స్త్రీలు 9 కప్పుల నీరు త్రాగాలి. అంతేకాకుండా, శరీరానికి అవసరం అయ్యే నీరు వ్యక్తి యొక్క శరీర పరిమాణం మరియు అతడు నిర్వహించే పనుల పైన ఆధారపడి ఉంటుంది.


    No comments:

    Post a Comment

    "జైలవకుశ " ట్రైలర్ 

    అదిరిపోయిన నందమూరి తారకరామారావు  "జైలవకుశ " ట్రైలర్  జూ ఎన్టీఆర్  హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్నా  "జై లవకుశ "...