Sunday, 26 March 2017

భయంకరంగా ఎన్టీఆర్ గెటప్..జై లవకుశ ఫొటో లీక్!






జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చాలా గ్యాప్ తీసుకొని చేస్తున్న చిత్రం జై లవకుశ. ఈ చిత్రంలోని ఎన్టీఆర్ పోషిస్తున్న పాత్రకు సంబంధించిన ఓ భయంకరమైన ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నది.

ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రమిది. జై లవకుశ అని ప్రచారవవుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రానికి తారక్ సోదరుడు కల్యాణ్ రామ్ నిర్మాత. ఈ చిత్రానికి ఇద్దరు హాలీవుడ్ నిపుణులు పనిచేస్తున్నారు. విలన్ ఛాయలున్న ఓ పాత్ర కోసం ప్రత్యేకంగా హలీవుడ్ నుంచి మేకప్ మెన్ రప్పించిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో ఆచారీ, పోలీసు అధికారి, ఓ విలన్ పాత్రను ఎన్టీఆర్ పోషిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఆ వార్తలను బట్టి పోలీస్ అధికారి పాత్ర పేరు ఎన్ లవ కుమార్ అనే విషయం స్పష్టమవుతున్నది. విలన్ ఛాయలున్న పాత్ర కోసం ప్రత్యేకంగా హాలీవుడ్ నుంచి మేకప్ మెన్‌ను రప్పించారు.

No comments:

Post a Comment

"జైలవకుశ " ట్రైలర్ 

అదిరిపోయిన నందమూరి తారకరామారావు  "జైలవకుశ " ట్రైలర్  జూ ఎన్టీఆర్  హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్నా  "జై లవకుశ "...