నాగచైతన్య, సమంత పెళ్లికి సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్.. అలా జరుగుతుందా.. టాలీవుడ్‌లో ప్రేమ జంట అక్కినేని నాగచైతన్య, సమంత పెళ్లి త్వరలోనే జరుగున్నదనే వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నది. వీరి వివాహాన్ని ఆగస్టులో చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం.
టాలీవుడ్‌లో ప్రేమ జంట అక్కినేని నాగచైతన్య, సమంత పెళ్లి త్వరలోనే జరుగున్నదనే వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నది. వీరి వివాహాన్ని ఆగస్టులో చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. ఇటీవల హైదరాబాద్‌లో నాగచైతన్య, సమంతల నిశ్చితార్థం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అక్కినేని వారసుడు అఖిల్ పెళ్లి అనూహ్యంగా క్యాన్సిల్ కావడంతో వీరి పెళ్లి జరుగుతుందా లేదా అనే రూమర్లు ఇటీవల విస్తృతంగా ప్రచారమైన సంగతి తెలిసిందే.
అక్కినేని నాగార్జున ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న రారండోయ్ వేడుక చూద్దాం అనే సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం కల్యాణకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్నది. ఓ పక్క ఈ సినిమా జరుగుతుండగానే చందు మొండేటి సినిమాపై దృష్టిపెట్టాడు. ఈ సినిమాలను ఆగస్టులోగా పూర్తి చేసుకొని పెళ్లికి సిద్దం కావాలని నాగచైతన్య తన ప్రణాళికను రూపొందించుకున్నట్టు సమాచారం
. రాంచరణ్‌తో సమంత బిజీ ఇక సమంత కూడా రెండు మూడు చిత్రాలతో బిజీగా ఉంది. రాంచరణ్ నటిస్తున్న చిత్రంలో సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నది. ఈ చిత్రంతోపాటు అక్కినేని నాగార్జున నటిస్తున్న ‘రాజుగారి గది2', సావిత్ర జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మహానటి చిత్రంలో నటిస్తున్నది. షూటింగ్‌లతో బిజి బిజి మండు వేసవిలో కూడా నాగచైతన్య, సమంత తమ తమ షూటింగ్‌లతో బిజీ బిజీగా ఉన్నారు.
పెళ్లి వేడుకకు ముందే అన్ని చిత్రాల షూటింగ్‌లు పూర్తి చేసుకోవాలనే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. చేతిలో ఉన్న సినిమాలు త్వరగా పూర్తి చేసుకోని పెళ్లి పీటలు ఎక్కాలన్న ప్లాన్‌తో వీరిద్దరూ ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తున్నది. అఖిల్ షూటింగ్‌లో .. ఇక అఖిల్, శ్రియాభూపాల్ వెడ్డింగ్ బ్రేక్ కావడం టాలీవుడ్‌లో సంచలనం రేపింది. పెళ్లి క్యాన్సిల్ కావడంతో అఖిల్ తన రెండో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇక శ్రీయా భూపాల్ ఎన్నారై వరుడిని పెళ్లి చేసుకోనున్నారనే రూమర్లు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి
. జీవీకే ఫ్యామిలీ తీసుకొచ్చిన ఎన్నారై సంబంధాన్ని శ్రీయా ఓకే చేసినట్టు వార్తలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. సమంత రుత్ ప్రభు విహంగ వీక్షణం బయోగ్రఫీ అభిమాని మాట అద్భుతమైన చిత్రాలు ఫోటోలు వీడియోలు రాబోతున్న సినిమాలు వాల్ పేపర్లు
No comments:
Post a Comment